PCB vs Amir: టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశలోనే పాకిస్థాన్ జట్టు నిష్క్రమించడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. టోర్నీలో నిరాశాజనక ప్రదర్శన చేసినందుకు జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 50 లక్షల (5 మిలియన్) జరిమానా విధించినట్లు తెలుస్తుంది. వరుసగా నాలుగోసారి ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకోలేకపోవడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా గ్రూప్ దశలో భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో ఎదురైన భారీ ఓటమి తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఆ ఓటమి పాక్ క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేయడంతో పాటు పీసీబీ అధికారులకు కోపం వచ్చేలా చేసిందని సమాచారం.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ పాకిస్థాన్ పేసర్ మొహమ్మద్ అమీర్ బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు. కేవలం ఆటగాళ్లనే లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని, సెలక్షన్ కమిటీ, బోర్డు సభ్యులు కూడా బాధ్యత తీసుకోవాలని తెలిపాడు. జరిమానాలే పరిష్కారం అయితే సెలెక్టర్ల నుంచి పరిపాలనా వర్గం వరకు అందరికీ వర్తింపజేయాలని కోరారు. తప్పుడు కాంబినేషన్లు ఎంచుకుంటే ఆ బాధ్యత సెలెక్టర్లదే.. ఆటగాళ్లను బలి పశువులుగా మార్చడం సరైన పరిష్కారం కాదని పేర్కొన్నాడు. ఫైన్స్ విధించడం వల్ల పాకిస్థాన్ క్రికెట్ మెరుగుపడదని అతడు అభిప్రాయపడ్డాడు. దేశీయ క్రికెట్‌ను బలోపేతం చేయడమే అసలైన పరిష్కారమని తెలిపాడు. ప్లేయర్స్ ని డబ్బుతో శిక్షించకండి.. టీమ్ నుంచి తప్పించి, రెండేళ్లు జట్టు నుంచి తప్పించి నిరంతరంగా రాణించాలని చెప్పండి.. జట్టులో చోటు కోల్పోవడమే వారికి పెద్ద శిక్ష అని అమీర్ వెల్లడించాడు.
►ALSO READ | IPL 2026: బెంగళూరులో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ.. ఆర్సీబీ హోంగ్రౌండ్లోనే ప్లేఆఫ్స్, ఫైనల్
మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. ఈ నిర్ణయం దారుణం.. 50 లక్షలు తీసుకుంటే ఏమవుతుంది? ఇది అసలు శిక్ష కాదు.. సమస్యకు ఇది పరిష్కారం కాదన్నారు. ప్రదర్శన ఆధారంగా చర్యలు తీసుకోవాలని, విఫలమైన ప్లేయర్స్ దేశీయ లీగ్స్ ఆడి తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించాడు. కాగా ఫిబ్రవరి 28వ తేదీన సూపర్ 8 దశలోనే పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై 5 పరుగుల తేడాతో గెలిచినా, అది సెమీస్ కి వెళ్లే రన్ రేట్ సరిపోకవడంతో.. అధికారికంగా టోర్నీ నుంచి తప్పుకుంది పాకిస్తాన్.
Mohammad Amir said, "If fines are the solution, then apply them to everyone, From selectors to administration. Players weren't forced at gunpoint. If wrong combinations were picked, hold those selectors accountable. Stop making players the scapegoat, this isn't a real solution." pic.twitter.com/4THFftlTMq
— Salman. (@TsMeSalman) March 3, 2026
