టెహ్రాన్: ఇరాన్‌పై భీకర దాడులతో విరుచుకుపడుతోన్న ఇజ్రాయెల్-అమెరికా దేశాలు ఇరాన్ అగ్ర నాయకులను టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాలు పలువురు టాప్ లీడర్లు లేపేశాయి. ఇదిలా ఉండగానే.. ఇజ్రాయెల్ లేటేస్ట్‌గా జరిపిన దాడుల్లో ఇరాన్ రక్షణ శాఖ మంత్రి సయ్యద్ మాజిద్ ఎబ్న్ అల్-రెజా హతమయ్యారు.
ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) వెల్లడించింది. గత నాలుగు రోజులుగా ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇరాన్ టాప్ లీడర్సే లక్ష్యంగా అమెరికా ఆపరేషన్ సాగుతోంది.
►ALSO READ | వాళ్లను లేపేయటానికి నాకు ఒక్క బాంబు చాలు : ఇరాన్ కు మద్దతిస్తూ కిమ్ కామెంట్స్..!
ఈ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్‌జాదే మృతి చెందారు. నాసిర్‌జాదే మృతితో సయ్యద్ మాజిద్ ఎబ్న్ అల్-రెజా ఇరాన్ తాత్కాలిక మంత్రిగా సోమవారం (మార్చి 2) బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఆయన కూడా అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు.
