- రూరల్ క్రికెటర్లకు వేదిక ఇదే
- కాకా వర్ధంతి రోజున ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 లీగ్ స్టార్ట్
- ఐపీఎల్ తరహాలో నిర్వహణ, గ్రామీణ ప్రతిభకు పెద్ద పీట
- స్టేడియంలకు భూమి, హెచ్సీఏ నుంచి నిధులపై విజ్ఞప్తి
- మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: విశాక ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరి యల్ తెలంగాణ ఇంటర్ప్రైస్ట్రిక్ట్స్ టీ20 లీగ్ ఫైనల్ లో నిజామాబాద్ జిల్లా టీమ్ విజేతగా నిలిచింది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన టైటిల్ పోరులో ఖమ్మం జిల్లా జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ఎంచుకుంది. 19.5 ఓవర్లలో 114 రన్స్ కే అలౌట్ అయ్యింది.
అనంతరం 115 పరుగుల టార్గెట్ తో చేజింగ్ స్టార్ట్ చేసిన నిజామాబాద్ టీం 12 ఓవర్లలోనే (ఇంకా 8 ఓవర్లు మిగిలి ఉండగానే) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హర్షవ ర్ధన్ సింగ్ (69 పరుగులు, 37 బాల్స్) అద్భు తమైన బ్యాటింగ్ తో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. విజేతగా నిలిచిన టీమ్ కు నిర్వాహకులు రూ.5 లక్షల ప్రైజ్ మనీ అందజేశారు.
అంతకుముందు టోర్నీలో పాల్గొన్న టీమ్ సభ్యులందరినీ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్ర భాకర్, అజారుద్దీన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సభ్యులు అభినందించారు.
డిసెంబర్ 22న కాకా వర్ధంతి రోజున ఈ టోర్నీని ప్రారంభించామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది క్రికెటర్లు బయటికి రావాల న్న ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు. గతంలో వెలుగు పత్రిక ద్వారా కూడా ఇలాంటి టోర్నీ నిర్వహించామని, ఇప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ తరపున ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 లీగ్ ఐపీఎల్ తరహాలో నిర్వ హించామని స్పష్టం చేశారు. ప్రపంచంలో క్రికెట్ ఒక పెద్ద క్రీడగా ఎదిగిందని పేర్కొన్న మంత్రి, హెచ్సీఏ నుంచి జిల్లా క్రికెట్ అసోసియేషన్లకు మరింత నిధులు కేటాయించాలని హెచ్సీఏ అధ్యక్షుడిని కోరారు.
స్టేడియంల నిర్మాణానికి భూమి అవసరమని రెవెన్యూ మంత్రికి తెలియజేశామని, వరంగల్లో ఇప్పటికే గ్రౌండ్ స్థలం సిద్ధంగా ఉందని, ఇతర జిల్లాల్లో కూడా గ్రౌండ్ల కోసం స్థలం కావాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నపుడే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం కోసం భూమి సేకరించి నిర్మించామని గుర్తుచేశారు.
►ALSO READ | క్రికెట్కు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడంలో కాకా వెంకటస్వామి కృషి.. అందుకే IPL సక్సెస్: మంత్రి వివేక్
కాకా వెంకటస్వామి ఉన్నపుడే టాక్సీ బెనిఫిట్ అంశంపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరంతో మాట్లాడి ప్రయోజనాలు సాధించామని తెలిపారు. హెచ్సీఏ ప్రతి సంవత్సరం ఇలాంటి ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 లీగ్ నిర్వహించాలని కోరుతూ, విశాఖ ఇండస్ట్రీస్ ఎప్పటికీ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ టోర్నీలో విజయం సాధించిన జట్టుకు అభినందనలు తెలియజే స్తూ, ఎలాంటి లోపాలు లేకుండా టోర్నీ విజయవంతంగా కొనసాగిందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.
తెలంగాణ క్రికెట్కు ఇదో కొత్త దిశ : పొన్నం
కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్ జరగడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దాదాపు 500 మంది టాలెంట్ ఉన్న క్రీడాకారులకు ఇలాంటి టోర్నీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యంగా బౌలింగ్, బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లకు రానున్న రోజుల్లో హెచ్సీఏ మరింత సహకారం అందించాలని సూచించారు.
కాకా వెంకటస్వామి కుమా రుడిగా వివేక్ వెంకటస్వామి ఈ టోర్నీని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ క్రీడా పరంగా ముందుండాలంటే ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో గుర్తించి మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
ఇతర జిల్లాల్లోనూ స్టేడియాలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ తరహాలో ఇతర జిల్లాల్లోనూ క్రికెట్ స్టేడియాలను ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. కాకా క్రికెట్ టోర్నీ నిర్వహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసే టోర్నీ: పొంగులేటి
విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాకా వెంకట స్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 లీగ్ మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసిన టోర్నీగా నిలిచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అన్ని జిల్లాలను కవర్ చేస్తూ ఈ లీగ్ నిర్వహించడం ద్వారా గ్రామీణ స్థాయి ప్రతిభకు మంచి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. మన మధ్య లేని కాకా వెంకటస్వామి గుర్తింపుగా ఆయన కుమారుడు వివేక్ వెంక టస్వామి క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి టోర్నీ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
