క్రికెట్కు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడంలో కాకా వెంకటస్వామి కృషి.. అందుకే IPL సక్సెస్: మంత్రి వివేక్

క్రికెట్కు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడంలో కాకా వెంకటస్వామి కృషి.. అందుకే IPL సక్సెస్: మంత్రి వివేక్

క్రికెట్ తో కాకా వెంకటస్వామికి మంచి అనుబంధం ఉండేదని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. క్రికెట్కు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడంలో ఆయన కృషి చేశారని.. అందుకే ఇండియాలో ఐపీఎల్ లాంటి టోర్నీలు సక్సెస్ అయ్యాయని తెలిపారు. విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో శనివారం (జనవరి 17) నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ T20 లీగ్ ఫైనల్ మ్యాచ్ కు హాజరైన మంత్రి వివేక్.. టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్ ప్రతీ ఏడాది ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలు నిర్వహించాలని కోరారు. మహిళా క్రికెట్ ను ప్రోత్సహించేందుకు కాకా మెమోరియల్ ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. కాకా వెంకటస్వామి వర్ధంతి రోజు టౌర్నమెంట్ ప్రారంభమైందని తెలిపారు. కాకా టోర్నీలో 500 మంది ప్లేయర్లు పాల్గొన్నారని చెప్పారు. ఎక్కడ కూడా వివాదం లేకుండా టోర్నీ నిర్వహిచడం అభినందనీయమని అన్నారు. 

►ALSO READ | నితీష్ రెడ్డి అసలు ఆల్ రౌండరే కాదు: తెలుగు క్రికెటర్‎పై మహ్మద్ కైఫ్ షాకింగ్ కామెంట్స్

క్రికెటర్ల ట్యాలెంట్ బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే కాకా మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 టోర్నీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ జిస్లా స్థాయి నుంచి యువత ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. ఐపీఎల్ లాగే డిస్ట్రిక్ట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టైప్ లో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ కు .. ఐపీఎల్ తరహాలో హైప్ ఉంటుందన్నారు.

గతంలో అన్ని జిల్లాల్లో స్టేడియాలు కట్టించాలనే ఆలోచన ఉండేదని అన్నారు మంత్రి వివేక్. స్టేడియాలు కట్టించేందుకు ప్రతి జిల్లాలో స్థలాలు కేటాయించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. స్థలాలు కేటాయిస్తే బీసీసీఐ సహకారంతో స్టేడియాల నిర్మించవచ్చునని తెలిపారు.