నితీష్ రెడ్డి అసలు ఆల్ రౌండరే కాదు: తెలుగు క్రికెటర్‎పై మహ్మద్ కైఫ్ షాకింగ్ కామెంట్స్

నితీష్ రెడ్డి అసలు ఆల్ రౌండరే కాదు: తెలుగు క్రికెటర్‎పై మహ్మద్ కైఫ్ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్: తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ కాదని.. అతను కేవలం బ్యాట్స్‎మెన్ మాత్రమేనని అన్నాడు. బీసీసీఐ ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్ధం చేసుకుంటే వారికి అంత మంచిదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఆల్ రౌండర్ పేరుతో నితీష్ జట్టులో టీమ్ సెటప్ సరిగ్గా లేక కెప్టెన్‎కు కంపర్టబుల్‎గా ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. టీమ్‎లో అతడు ఆరవ బౌలర్ కాదని.. నిజానికి అతనొక పార్ట్ టైమ్ బౌలర్ అని అభివర్ణించాడు. అసలు జట్టులో నితీష్ రెడ్డి పాత్ర ఏంటో నాకు అర్థం కావడం లేదని.. టీమిండియా కోచ్, మేనేజ్‌మెంట్ దయచేసి టీమ్‎లో అతడి పాత్ర ఏంటో తనకు చెప్పాలని కోరాడు. 

రాజ్‎కోట్ వేదికగా న్యూజిలాండ్‎తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ప్లేయింగ్ లెవన్ ఎంపికపైన కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నెమ్మదిగా ఉన్న రాజ్‌కోట్‌ పిచ్‎పై టీమిండియా నలుగురు పేసర్లతో ఆడిందని.. కానీ పర్యాటక న్యూజిలాండ్ జట్టు రాజ్ కోట్ పిచ్ పరిస్థితులను బాగా అర్థం చేసుకుందన్నారు.

 స్పిన్ వారి బలం కాకపోయిన న్యూజిలాండ్ ఈ మ్యాచులో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిందని గుర్తు చేశారు. అసలు రెండో వన్డే కోసం ఎంపిక చేసిన జట్టు వ్యూహమేంటో తనకు అర్ధం కాలేదన్నాడు. అసలు జట్టులో నితీష్ కుమార్ రెడ్డి పాత్ర ఏంటని ప్రశ్నించాడు. నితీష్ అస్సలు ఆల్ రౌండరే కాదని కైఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

 కైఫ్ వ్యాఖ్యలపై నితీష్ అభిమానులు మండిపడుతున్నారు. కాగా, రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. పర్యాటక న్యూజిలాండ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఈ  మ్యాచులో గెలిచి సిరీస్‎ను 1-1 సమం చేసింది. సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 17న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వేదికగా జరగనుంది.