బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కామెడీ కింగ్ గోవిందా వ్యక్తిగత జీవితం ఇప్పుడు రచ్చకెక్కుతోంది. గత మూడు దశాబ్దాలుగా అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించి గోవిందా- సునీత అహుజా దంపతుల మధ్య విభేదాలు ఇప్పుడు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. గోవిందా అక్రమ సంబంధాలు, బాధ్యతారాహిత్యంపై ఆయన భార్య సునీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బిటౌన్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఖుక్రీ తీశానంటే...
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సునీత అహుజా తన మనసులోని ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. గోవిందాకు ఉన్న పరాయి స్త్రీల వ్యాపకంపై ఆమె ఘాటుగా స్పందించారు. జీవితంలో ఇలాంటి అమ్మాయిలు ఎందరో వస్తుంటారు, పోతుంటారు. కానీ నీకు ఇప్పుడు 63 ఏళ్లు వచ్చాయి. కాస్త విజ్ఞతతో ఆలోచించు. నీకు పెళ్లికి ఎదిగిన కూతురు టీనా ఉంది, కెరీర్ నిర్మించుకోవాల్సిన కొడుకు యష్ ఉన్నాడు. అయినా నీ బుద్ధి మారలేదు. నిన్ను నేను ఎప్పటికీ క్షమించనుఅంటూ గోవిందాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా తాను నేపాల్‌కు చెందిన బిడ్డనని గుర్తు చేస్తూ.. నేను గనుక ఖుక్రీ (నేపాలీ కత్తి) బయటకు తీశానంటే అందరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు అని భర్త గోవిందను హెచ్చరించింది.
అసలు నువ్వు తండ్రివేనా?
పిల్లల భవిష్యత్తు విషయంలో గోవిందా ఏమాత్రం పట్టించుకోవడం లేదని సునీత ఆరోపించారు. ముఖ్యంగా తన కుమారుడు యశ్‌వర్ధన్ కెరీర్ కోసం గోవిందా ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యష్ కూడా ఎప్పుడూ తన తండ్రి నుంచి సాయం కోరలేదు.. పోనీ తండ్రిగా ఆయనైనా తనంతట తానుగా ఏమైనా చేశారా అంటే అదీ లేదు. అందుకే ఆయన ముఖం మీదే అడిగేశాను అని చెప్పింది. అసలు నువ్వు తండ్రివేనా? అని ప్రశ్నించినట్లు చెప్పుకొచ్చింది..
విడాకుల దిశగా అడుగులు?
1987లో వివాహం చేసుకున్న ఈ జంట మధ్య గత ఏడాది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి నుంచే వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ మధ్యలో వినాయక చవితి వేడుకల్లో కలిసి కనిపించి అంతా బాగుందని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, లోలోపల సెపరేషన్ నోటీసులు కూడా వెళ్లినట్లు సమాచారం. ఇటీవల గోవిందా ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయి ఆసుపత్రిలో చేరిన విషయం కూడా తనకు మీడియా ద్వారానే తెలిసిందని సునీత చెప్పడం వీరి మధ్య ఉన్న దూరాన్ని స్పష్టం చేస్తోంది.
►ALSO READ | Anil Ravipudi: రాజమౌళి తర్వాత ఆ రేంజ్ అనిల్ రావిపూడిదేనా?.. భారీ ఆఫర్స్‌తో క్యూ కడుతున్న అగ్ర నిర్మాతలు!
ఒకప్పుడు తన డాన్స్, యాక్టింగ్‌తో కోట్లాది మందిని అలరించిన గోవిందా, ఇప్పుడు తన సొంత ఇంట్లోనే విమర్శల పాలవుతున్నారు. గోవిందా ఇప్పటికైనా తన తప్పులు సరిదిద్దుకుంటారా? లేక ఈ వివాదం విడాకులకు దారితీస్తుందా? అన్నది బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
