Anil Ravipudi: రాజమౌళి తర్వాత ఆ రేంజ్ అనిల్ రావిపూడిదేనా?.. భారీ ఆఫర్స్‌తో క్యూ కడుతున్న అగ్ర నిర్మాతలు!

Anil Ravipudi: రాజమౌళి తర్వాత ఆ రేంజ్ అనిల్ రావిపూడిదేనా?.. భారీ ఆఫర్స్‌తో క్యూ కడుతున్న అగ్ర నిర్మాతలు!

టాలీవుడ్ లో సక్సెస్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్ నుంచి మొదలైన ఆయన విజయయాత్ర.. ఇప్పుడు 'మన శంకర వర ప్రసాద్ గారు' (MSG) మూవీ వరకు ఎక్కడా బ్రేక్ లేకుండా సాగింది. వరుసగా తొమ్మిది హిట్లు కొట్టి సరికొత్త  మైలురాయిని చేరుకున్నారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా అనిల్ పేరే వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద అపజయం ఎరుగని దర్శకుడిగా ఆయన సృష్టించిన రికార్డులు ఇప్పుడు ఆయన్ని సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి.

రాజమౌళి తర్వాత ఆ రేంజ్ అనిల్ దేనా?

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవిని, అనిల్ తనదైన మార్క్ వినోదంతో వెండితెరపై ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఫుల్ సక్సెస్ మూడ్ లో ఉన్న అనిల్ రావిపూడి క్రేజ్ చూసి టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలు ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ వంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు అనిల్ తదుపరి సినిమా కోసం పోటీ పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది..

అంతే కాదు ఒక సినిమాకు అనిల్ ఏకంగా రూ. 50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారట. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా, సినిమా లాభాల్లో వాటా (Profit Sharing) కూడా ఇచ్చేందుకు నిర్మాతలు బేరమాడుతున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే, టాలీవుడ్‌లో ఎస్.ఎస్. రాజమౌళి తర్వాత అత్యధిక పారితోషికం అందుకునే దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి టాప్ ప్లేస్‌కు చేరుకుంటారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి..

'రాకెట్' స్పీడ్ తో.. 

ప్రస్తుతం టాలీవుడ్‌లో సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ, అనిల్ రావిపూడి శైలి వేరు. అనిల్ సినిమా అంటే బయ్యర్లకు నష్టం రాదనే నమ్మకం ఏర్పడింది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీని పండించడంలో ఆయన దిట్ట. అందుకే మహిళలు, పిల్లలు ఆయన సినిమాలకు క్యూ కడతారన్న అభిప్రాయానికి వచ్చారు. రాజమౌళి లేదా సుకుమార్ లాగా ఏళ్ల తరబడి కాకుండా, ఏడాదిలోపు సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం అనిల్ స్పెషాలిటీ. ఈ లక్షణాలే ఆయన్ని ఇప్పుడు రూ. 50 కోట్ల క్లబ్‌లో చేర్చాయి. ప్రశాంత్ నీల్ వంటి పాన్ ఇండియా డైరెక్టర్లు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పటికీ, లోకల్ మార్కెట్‌లో అనిల్ రావిపూడి 'సక్సెస్ రేట్' నిర్మాతలకు పెద్ద భరోసాగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

'మన శంకర వర ప్రసాద్ గారు' ఇచ్చిన బూస్ట్

మెగాస్టార్ చిరంజీవితో చేసిన  'మన శంకర వర ప్రసాద్ గారు'  (MSG)  చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ. 226 కోట్ల గ్రాస్ సాధించి, సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ సినిమాతో అనిల్ కేవలం కమర్షియల్ డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక పెద్ద స్టార్ ఇమేజ్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నిరూపించుకున్నారు. అనిల్ మార్క్ 'బాస్ బ్యాటింగ్' ఇప్పుడు ఆయన మార్కెట్‌ను ఆకాశానికి చేర్చింది. 

►ALSO READ | AR Rahman Vs Bollywood : ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై దుమారం.. షాన్, వీహెచ్‌పీ స్ట్రాంగ్ రియాక్షన్!

అంతే కాకుండా వరుసగా తొమ్మిది హిట్లు కొట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. తనదైన మేనరిజమ్స్, హిలేరియస్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే అనిల్, తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఏ అగ్ర హీరోతో పట్టాలెక్కిస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్ తర్వాతి సినిమా గనుక పాన్ ఇండియా స్థాయిలో ఉంటే, ఆయన రేంజ్ మరింత పెరగడం ఖాయం అంటున్నారు అభిమానులు.