AR Rahman Vs Bollywood : ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై దుమారం.. షాన్, వీహెచ్‌పీ స్ట్రాంగ్ రియాక్షన్!

AR Rahman Vs Bollywood : ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై దుమారం.. షాన్, వీహెచ్‌పీ స్ట్రాంగ్ రియాక్షన్!

భారతీయ సంగీత ప్రపంచంలో ఏఆర్ రెహహన్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది.  ఆస్కార్ వేదికపై 'జై హో' అంటూ భారత కీర్తిని చాటిన సంగీత మాంత్రికుడు. అయితే ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమలో మారుతున్న సమీకరణాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్తా ఇప్పుడు మతపరమైన రంగు పులుముకుని రాజకీయ దుమారానికి దారితీసింది.

నా ముఖం మీద చెప్పరు కానీ..

రెహమాన్ గత కొంతకాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉంటున్నారన్నది వాస్తవం. దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ.. పరిశ్రమలో పవర్ షిఫ్ట్ జరిగింది అన్ని అన్నారు.  పరిశ్రమలో సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లోకి అధికారం వెళ్లిందని విమర్శించారు.  ఇది మతపరమైన వివక్ష కూడా కావొచ్చు. అది నా ముఖం మీద నేరుగా జరగడం లేదు కానీ, గుసగుసల రూపంలో నాకు చేరుతోంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమను కుదిపేస్తున్నాయి. తాను అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే రకం కాదు. చిత్తశుద్ధి ఉంటే పని వెతుక్కుంటూ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

షాన్ కౌంటర్..

రెహమాన్ వ్యాఖ్యలపై ప్రముఖ సింగర్ షాన్ ఘాటుగా స్పంచించారు. అవకాశాలు రాకపోవడానికి మతాన్ని ముడిపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. నేను ఇన్నేళ్లు ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడాను. కానీ ఇప్పుడు నాకూ అవకాశాలు రావడం లేదు. నేను కూడా ఖాళీగానే ఉన్నాను కదా . అంతమాత్రాన అది మత వివక్ష ఎలా అవుతుంది? అది వ్యక్తిగత ప్రాధాన్యతలకు సంబంధించిన విషయం అని షాన్ కౌంటర్ ఇచ్చారు.

షారుఖ్ ఖాన్, సల్మాన్, అమీర్ ఖాన్ లు మైనారిటీలైనా గత 30 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక్కడ ప్రతిభకే ప్రాముఖ్యత ఉంటుందని ఆయన గుర్తు చేశారు. అతిగా ఆలోచించకుండా మంచి సంగీతం చేయడంపై దృష్టి పెట్టండి అని రెహమాన్ కు షాన్ సూచించారు.

 

 రంగంలోకి వీహెచ్‌పీ!

ఈ వివాదం అంతటితో ఆగకుండా రాజకీయ మలుపు తిరిగింది. విశ్వహిందూ పరిషత్ (VHP) జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు.  అవకాశాలు ఎందుకు రావడం లేదో రెహమాన్ తనను తాను ప్రశ్నించుకోవాలని, పరిశ్రమను నిందించడం తగదని అన్నారు. ఒకప్పుడు దిలీప్ కుమార్‌గా (హిందువుగా) ఉన్న రెహమాన్ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అర్థం లేదని, ఆయనకు అవకాశాలు కావాలంటే మళ్ళీ 'ఘర్ వాపసీ' (స్వధర్మం) కావాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

►ALSO READ | Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద బాస్ బ్యాటింగ్: 'మన శంకర వరప్రసాద్ గారు' రికార్డుల వేట.. ఎన్ని వందల కోట్లంటే?

కళాకారుడికి రంగు ఉంటుందా?

రెహమాన్ వంటి అంతర్జాతీయ స్థాయి కళాకారుడు 'వివక్ష' గురించి మాట్లాడటం బాలీవుడ్‌తో పాటు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు షాన్ వాదన ప్రకారం.. మారుతున్న ప్రేక్షకుల అభిరుచి, కొత్త తరం సంగీత దర్శకుల రాక వల్ల సీనియర్లకు అవకాశాలు తగ్గడం సహజం అంటున్నారు..ఒక వర్గం రెహమాన్ ఆవేదనలో నిజం ఉందని అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన సంగీతంలో మునుపటి మ్యాజిక్ తగ్గడం వల్లే అవకాశాలు తగ్గాయని అభిప్రాయపడుతున్నారు. ఒక కళాకారుడికి మతం కంటే ప్రతిభే ప్రాతిపదిక కావాలని మెజారిటీ నెటిజన్లు కోరుకుంటున్నారు.