Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద బాస్ బ్యాటింగ్: 'మన శంకర వరప్రసాద్ గారు' రికార్డుల వేట.. ఎన్ని వందల కోట్లంటే?

Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద బాస్ బ్యాటింగ్: 'మన శంకర వరప్రసాద్ గారు' రికార్డుల వేట.. ఎన్ని వందల కోట్లంటే?

మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్.. ఆ ఎనర్జీకి అనిల్ రావిపూడి మార్క్ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలే అని 'మన శంకర వరా ప్రసాద్ గారు' మూవీ నిరూపిస్తోంది. సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో జనవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద శివతాండవం చేస్తోంది. మేకర్స్ కు కాసుల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగరాస్తోంది. ప్రభాస్ 'ది రాజా సాబ్' వంటి భారీ చిత్రంతో పోటీ ఉన్నప్పటికీ.. మెగాస్టార్ తనదైన శైలిలో 'బాస్ బ్యాటింగ్' చూపిస్తూ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట

అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరు వింటేజ్ మేజిక్ తోడవ్వడంతో మెగా అభిమానులు థియేటర్లలో పండగ చేసుకుంటున్నారు. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.226 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మొదటి రోజు రూ.32.25 కోట్ల నెట్ వసూళ్లతో అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంది. ఐదవ రోజుఏపీ-తెలంగాణలో రూ14.73 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పింది. ఈ  ఐదు రోజుల్లోనే టోటల్ ఇండియా నెట్ రూ. 120.35 కోట్లకు చేరుకుంది. విదేశాల్లో కూడా చిరు హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల మార్కును దాటి, చిరంజీవి కెరీర్‌లో పోస్ట్-కోవిడ్ టాప్ గ్రాసర్‌గా నిలిచింది.

 

రాజా సాబ్ వర్సెస్ శంకర వరప్రసాద్..

ఈ సంక్రాంతికి ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్'తో గట్టి పోటీ నెలకొంది. ఓపెనింగ్స్ పరంగా 'రాజా సాబ్' రూ.53.75 కోట్లతో ముందంజలో ఉన్నప్పటికీ, నిలకడైన వసూళ్లలో మాత్రం చిరు సినిమా పైచేయి సాధిస్తోంది. ది రాజా సాబ్ 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ రూ.133.75 కోట్లు. అయితే, వర్కింగ్ డేస్‌లో ఈ సినిమా వసూళ్లు భారీగా తగ్గాయి. 8వ రోజు కేవలం రూ.3.5 కోట్లు మాత్రమే రాబట్టింది. మన శంకర వరప్రసాద్ గారు 5 రోజుల్లోనే రూ.120.35 కోట్లు సాధించి, రెండో వీకెండ్ నాటికి ప్రభాస్ సినిమాను అధిగమించే దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చిరు సినిమాకు 60 నుంచి -70 శాతం ఆక్యుపెన్సీ ఉండగా, రాజా సాబ్ 34 శాతం వద్ద తడబడుతోంది.

 వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్!

దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవిలోని వింటేజ్ కామెడీ టైమింగ్‌ను వంద శాతం వాడుకున్నారు. 'ఘరానా మొగుడు' కాలం నాటి చిరుని చూస్తున్నామని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మేము కోరుకున్న పక్కా మాస్, కామెడీ బాస్‌ను అనిల్ రావిపూడి మళ్లీ చూపించారు అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా వెంకటేష్ అతిథి పాత్ర, నయనతార నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, ముఖ్యంగా మాస్ సాంగ్స్ థియేటర్లను ఊపేస్తున్నాయి.

►ALSO READ | Tamannaah: బిలియన్ క్లబ్‌లో మిల్కీ బ్యూటీ.. యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా తమన్నా! ఎందుకంటే?

మొత్తానికి, 'మన శంకర వరప్రసాద్ గారు' ఒక రీజనల్ సినిమాగా ఆల్ టైమ్ రికార్డులను సృష్టిస్తూ, ఈ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ, డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్ ఈవెన్ సాధించి పెడుతోంది. మరిన్ని రికార్డులను ఈ చిత్రం తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.