విజయవాడ-హైదరాబాద్ హైవేలో వస్తున్న వాళ్లకు అలర్ట్.. ఈ డైవర్షన్స్ను దృష్టిలో ఉంచుకుని రండి !

విజయవాడ-హైదరాబాద్ హైవేలో వస్తున్న వాళ్లకు అలర్ట్.. ఈ డైవర్షన్స్ను దృష్టిలో ఉంచుకుని రండి !

సంక్రాంతి పండగ ముగించుకుని మళ్లీ హైదరాబాద్ బాట పట్టారు జనాలు. ఈ క్రమంలో హైవేలపై ట్రాఫిక్ తిప్పలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. చీమల బారుల్లా వాహనాలు క్యూ కట్టడంతో విజయవాడ-హైదరాబాద్ హైవే పై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. శనివారం (జనవరి 17) యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దగ్గర హైవేపైవాహనాల రద్దీ తీవ్రంగా ఉండటంతో వాహనాదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.

పంతంగి టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ మేరా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో వాహనాలు మెల్లగా కదులుతున్నన్నాయి. ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వైపు 11 టోల్ బూత్ లను తెరిచారు టోల్ ప్లాజా అధికారులు. వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు పోలీసులు, టోల్ ప్లాజ సిబ్బంది.

ట్రాఫిక్ డైవర్షన్ ఇలా:

విజయవాడ-హైదరాబాద్ రూట్లో వాహనాలు పెరుగుతుండటంతో ట్రాఫిక్ డైవర్షన్స్ చేపడుతున్నారు పోలీసులు. జాతీయ రహదారి 65 పై చిట్యాల వద్ద కొత్త బ్రిడ్జి నిర్మాణంలో ఉండటంతో  ట్రాఫిక్ అంతరాయం మరింతగా పెరిగింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు  బారులు తీరాయి. 

►ALSO READ | తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా ఏప్రిల్ నెల దర్శన కోటా విడుదల
 
రద్దీని తగ్గించడానికి మూడు లైన్లలో వాహనాల మళ్లింపు చేపట్టారు పోలీసులు. పెరిగిన ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకుని కోదాడ, నల్లగొండ బైపాస్ వద్ద దారి మళ్లించారు. కచ్చ రోడ్డుపై వాహనాలను పంపడంతో తీవ్రంగా దుమ్ము లేస్తుంది. దీంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.