చంద్రగ్రహణ ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలను మూసివేస్తున్నారు. ఇప్పటికే ( వార్త రాసే సమయానికి) శ్రీశైలం ఆలయం మూసి వేయగా.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఆలయం మూసి ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ రోజు ( మార్చి 3) మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం ... సాయంత్రం 6:47 గంటల వరకు ఉంటుంది.
వేద సంప్రదాయం ప్రకారం గ్రహణానికి ఆరు గంటల ముందే ఆలయ తలుపులు మూసివేస్తారు..
రాత్రి 7:30 గంటలకు తలుపులు తీసి, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. మళ్లీ తిరిగి తిరుమల శ్రీవారి దర్శనాలు రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతాయని టీటీటీ అధికారులు తెలిపారు.
