Gold & Silver: పండగ అవ్వగానే పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాద్ తాజా రేట్లివే..

Gold & Silver: పండగ అవ్వగానే పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాద్ తాజా రేట్లివే..

సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే బంగారం, వెండి రేట్లు కొంత చల్లబడతాయ్ అనుకున్నారు అందరూ. కానీ అనూహ్యంగా పండగ అయిపోగానే విలువైన లోహాల ధరలు ర్యాలీ చేయటం స్టార్ట్ చేశాయి. దీంతో పండగ అవ్వగానే రేట్లు తగ్గుతాయ్.. అప్పుడు జ్యువెలరీ వస్తువులు కొనుక్కోవచ్చని ప్లాన్ చేసుకున్న వారి కలలు తలకిందులయ్యాయి. ఈ క్రమంలో ఎవరైనా షాపింగ్ చేయాలనుకునే వారు తమ ప్రాంతంలోని రేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం. 

జనవరి 17న బంగారం రేట్లు స్వల్ప పెరుగుదలతో వినియోగదారులకు ఊరటను కొనసాగిస్తున్నాయి. దీంతో జనవరి 16 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.38 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 378గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 180గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ఇక వెండి విషయానికి వస్తే అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీ పండుగ తర్వాత కూడా కొనసాగుతోంది. శనివారం జనవరి 17, 2025న వెండి రేటు కేజీకి రూ.3 వేలు పెరగటంతో కొనుగోలుదారులను షాక్ కి గురిచేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 10వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.310 వద్ద ఉంది.