ముషీరాబాద్, వెలుగు: విద్యుత్ లైన్ మెయింటెనెన్స్ లో భాగంగా శనివారం పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అజమాబాద్ ఏడీఈ జి.నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డీడీ కాలనీ, నల్లకుంట, సీసీ స్రాప్ కాచిగూడ, అజామాబాద్, విద్యానగర్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాస్త్రి నగర్, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండబోదని పేర్కొన్నారు.
