మొన్నటికి మొన్న అమీర్ పేటలో ఓ ఇంట్లో వాషింగ్ మెషీన్ పేలిపోయింది. ఆ ఘటన మర్చిపోక ముందే హైదరాబాద్ సిటీ నడిబొడ్డున.. ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. 2026, జనవరి 17వ తేదీ ఉదయం హైదరాబాద్ సిటీలో కలకలం. యూసుఫ్ గూడ పరిధిలోని కృష్ణానగర్ లోని జైన్ టెంపుల్ ఎదురుగా ఉన్న సయ్యద్ గౌస్ ఇంట్లోని సెకండ్ ఫ్లోర్ లో.. సాంబశివారెడ్డి అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఉదయం 7.30 గంటలకు వాషింగ్ మెషీన్ నుంచి మంటలు వచ్చాయి. ఆ తర్వాత వెంటనే పొగతోపాటు పెద్ద శబ్ధంతో వాషింగ్ మెషీన్ మోటారు పేలిపోయింది.
మెషీన్ ఆన్ చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. రన్నింగ్ లో ఉన్న వాషింగ్ మెషీన్ పేలిపోవటంతోనే ఈ ఘటన జరిగింది. పెద్ద శబ్ధంతో వాషింగ్ మెషీన్ మోటార్ పేలిపోవటంతో.. మెషీన్ అంతా ముక్కలు ముక్కలు అయ్యింది.
ALSO READ : హైదరాబాద్ సిటీ శివార్లలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
వాషింగ్ మెషీన్ పేలిన సమయంలో.. సమీపంలో ఇంట్లో వాళ్లు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన వెంటనే.. స్థానికులతోపాటు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇంట్లో వస్తువులు దెబ్బతిన్నాయి. ఇల్లు అంతా చిందరవందర అయ్యింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వాషింగ్ మెషీన్ మోటార్ పేలటం వల్లే ప్రమాదం జరిగిందని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు.
