పండగ పూట అందరూ హ్యాపీగా.. ఎవరి ఎంజాయ్ లో వాళ్లున్న సమయంలో.. హైదరాబాద్ సిటీ శివార్లలో దొంగలు రెచ్చిపోయారు. ముఖ్యంగా చైన్ స్నాచర్స్ తమ చేతి వాటాన్ని బాగా చూపించారు. 2026, జనవరి 17వ తేదీ ఉదయం హైదరాబాద్ సిటీ శివార్లలో వరసగా రెండు ఘటనలు జరిగాయి. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని 58 ఏళ్ల మనెమ్మ తన ఇంటి నుంచి తన కుమారుడు ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో.. ఆమె మెడలో ఉన్న 25 గ్రాముల బంగారం పుస్తెలతాడును లాక్కెళ్లారు. పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు కుర్రోళ్లు.. వేగంగా వచ్చి ఆమె మెడలోని బంగారం చైన్ లాక్కొని వెళ్లారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మనెమ్మ కొడుకు పోలీస్ SI..
Also Read : అన్న కండ్ల ముందే చెల్లి మృతి
ఇక హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజనాద్రి కాలనీలోనూ మరో చైన్ స్నాచింగ్ జరిగింది. 47 ఏళ్ల చింతకుంట్ల విజయ అనే మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారం పుస్తెలతాడును.. ఆమె మెడలో నుంచి తెంచుకుని వెళ్లారు దుర్మార్గులు.
ఈ రెండు ఘటనలు వరసగా జరగటంపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. చైన్ స్నాచింగ్ జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ పరిశీలించగా.. ఇద్దరు యువకులు పల్సర్ బైక్ పై వచ్చి చైన్ స్నాచింగ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఈ రెండు చైన్ స్నాచింగ్స్ చేసిందిన ఒకే ముఠానా.. వాళ్లే వీళ్లా.. ఈ రెండు చైన్ స్నాచింగ్స్ చేసిన ఒక్కరేనా అనే విషయాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు.
