హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం సమీపంలో ప్రమాదవశాత్తూ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఏఎస్ఓగా పని చేస్తోన్న కల్పన అనే మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన వారిని సూర్యాపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు.
ఒక్కసారిగా కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో తుంగతుర్తి జీహెచ్ఎం ప్రవీణ్, రావులపల్లి జీహెచ్ఎం గీత, అన్నారం జీహెచ్ఎం సునీతరాణి, కస్తూర్బా గాంధీ ఏఎస్ఓ కల్పన ఉన్నారు. ప్రవీణ్ కుమార్, కల్పన అన్నచెల్లెలు. ఈ ప్రమాదంలో అన్న కండ్ల ముందే చెల్లి కల్పన మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
