ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌లో టాప్‌‌ ప్లేస్‌‌లోకి మంధాన

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌లో టాప్‌‌ ప్లేస్‌‌లోకి మంధాన

దుబాయ్‌‌: ఇండియా విమెన్స్‌‌ జట్టు స్టార్‌‌ ఓపెనర్‌‌ స్మృతి మంధాన.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌లో టాప్‌‌ ప్లేస్‌‌లోకి దూసుకొచ్చింది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌లో ఒక్క ర్యాంక్‌‌ ఎగబాకి నంబర్‌‌వన్‌‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 790 రేటింగ్‌‌ పాయింట్లు ఉన్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌‌లో స్మృతి 58, 31 రన్స్‌‌ చేయడంతో తిరిగి టాప్ ర్యాంక్‌‌లోకి వచ్చింది.

సౌతాఫ్రికా బ్యాటర్‌‌ లారా వోల్‌‌వార్ట్ (782) రెండో ర్యాంక్‌‌కు పడిపోయింది. ఇండియా కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ (652), జెమీమా రోడ్రిగ్స్‌‌ (635) వరుసగా 9, 12వ ర్యాంక్‌‌ల్లో ఉన్నారు. బౌలింగ్‌‌లో దీప్తి శర్మ (514) ఐదు ర్యాంక్‌‌లు దిగజారి 10వ ర్యాంక్‌‌లో నిలిచింది. అలనా కింగ్‌‌ (775), సోఫీ ఎకిల్‌‌స్టోన్‌‌ (747), ఆష్లే గార్డ్‌‌నర్‌‌ (713) టాప్‌‌–3లో ఉన్నారు. ఆల్‌‌రౌండర్స్‌‌ లిస్ట్‌‌లో  దీప్తి శర్మ పదో ర్యాంక్‌‌లో ఉంది.