Anaganaga Oka Raju : నవీన్ పోలిశెట్టి నవ్వుల పంటకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో 'అనగనగా ఒక రాజు' కలెక్షన్స్!

Anaganaga Oka Raju : నవీన్ పోలిశెట్టి నవ్వుల పంటకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో 'అనగనగా ఒక రాజు' కలెక్షన్స్!

టాలీవుడ్ లో సంక్రాంతి సందడి అంటే కేవలం పెద్ద హీరోల గర్జన మాత్రమే కాదు. అప్పుడప్పుడు కొన్ని 'కల్ట్' సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటాయి. కంటెంట్ ఉంటే చాలు హీరోలతో సంబంధం లేకుండా ఆదరిస్తారు ప్రేక్షకులు. సరిగ్గా అదే బాటలో ప్రయాణిస్తూ.. ఈ ఏడాది పండగ విన్నర్‌గా నిలిచారు జాతి రత్నం నవీన్ పోలిశెట్టి. ఆయన నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) థియేటర్లలో నవ్వుల పూయించడమే కాదు.. కలెక్షన్ల సునామీని కూడా సృష్టిస్తోంది.

బాక్సాఫీస్ వద్ద 'రాజు'గారి గర్జన

యువత , ఫ్యామిలీ ఆడియన్స్‌లో నవీన్ పోలిశెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'జాతి రత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' తర్వాత ఆయన నుంచి వచ్చిన ఈ కంప్లీట్ కామెడీ ప్యాకేజీ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే రూ. 61.1 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రతిరోజూ సగటున రూ. 20 కోట్ల గ్రాస్‌ను సాధిస్తూ.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. సంక్రాంతి సెలవులు ముగిసేలోపు ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం దాదాపు ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఓవర్సీస్‌లో హవా!

నవీన్ పోలిశెట్టి సినిమాలకు అమెరికా మార్కెట్‌లో (US Box Office) విపరీతమైన డిమాండ్ ఉంటుంది. 'అనగనగా ఒక రాజు' విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది. యూఎస్ మార్కెట్‌లో ఈ చిత్రం భారీ ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది. అక్కడ ఉన్న ప్రవాసాంధ్రులు ఈ సినిమాలోని క్లీన్ కామెడీకి బ్రహ్మరథం పడుతున్నారు. నవీన్ ఎనర్జీ, మీనాక్షి చౌదరి గ్లామర్, నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

 

 నవీన్ వన్ మ్యాన్ షో

ముఖ్యంగా డైరెక్టర్ మారి ఈ సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతమనే చెప్పాలి. సినిమా ఆద్యంతం తనదైన మేనరిజమ్స్ ,  డైలాగ్ డెలివరీతో నవీన్ వన్ మ్యాన్ షో చేశారు.నవీన్ పక్కన మీనాక్షి కెమిస్ట్రీ ఆకట్టుకోవడమే కాకుండా, సినిమాకు ఒక గ్లామర్ టచ్ ఇచ్చింది. అంతే కాకుండా  మిక్కీ అందించిన మెలోడీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా వెడ్డింగ్ థీమ్ సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన ఈ చిత్రం విజువల్స్ పరంగా చాలా గ్రాండ్‌గా ఉందన్న అభిప్రాయం సినీ ప్రియుల నుంచి వ్యక్తం అవుతోంది.

►ALSO READ | Sunita Ahuja: ఛీ ఛీ 63 ఏళ్ల వయసు వచ్చినా ఆ బుద్ధి మారలేదా? హీరో అక్రమ సంబంధాలపై భార్య వార్నింగ్!

సంక్రాంతి రేసులో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నప్పటికీ, 'కంటెంట్ ఉంటే కటౌట్ చాలు' అని నవీన్ పోలిశెట్టి నిరూపించారు. కుటుంబం మొత్తం కలిసి హాయిగా నవ్వుకునే విధంగా ఉండటంతో థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే, నవీన్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.