సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలున్నాయి

సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలున్నాయి
సాగర్ ఉపఎన్నికపై మా పార్టీలో ఏంజరుగుతుందో తనకు తెలియదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తనను పోటీ చేయమని ఎవరూ అడగలేదని.. పోటీ చేయాలని ఉందని తాను ఎవరితో చెప్పలేదని ఆయన అన్నారు. ‘సాగర్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని నేనేమీ చెప్పలేను. నోముల కుటుంబానికి ఇస్తారో? లేదో? పార్టీ డిసైడ్ చేస్తుంది. రాష్ట్రంలో ఏ సంప్రదాయం అయినా ఉండొచ్చు. నల్గొండ జిల్లాలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ ఫ్యామిలికి చెందిన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా పెడదామని నేను అప్పీలు చేశాను. జిల్లాల్లో రాగ్యా నాయక్ చనిపోయినప్పుడు ఈ సంప్రదాయం పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా అదే కొనసాగించాలని నా అభిప్రాయం. పెద్ద పర్సనాలిటీలు, చిన్న పర్సనాలిటీలు అంటూ ఏంలేదు. పార్టీ గుర్తులకే ఓట్లు పడతాయి. జానారెడ్డి ఇప్పటికీ మూడుసార్లు ఓడిపోలేదా? జానారెడ్డి కొడుకు పోటీ చేస్తే పెద్ద ప్రయారిటీ ఏం ఉండదు. లోకల్, నాన్ లోకల్ ఇష్యూ కూడా లేదు. ఆల్ లీడర్స్ మకాన్ హైదరాబాదే. మార్చి లోపే ఉపఎన్నిక జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కొందరు ఎంపీలు, ప్రజా ప్రతినిధులు వాడుతున్న భాష సరిగాలేదు. సీఎంను ఏక వచనంతో మాట్లాడటం సరికాదు. మనుషులకు కాదు.. పదవికి గౌరవం ఇవ్వాలి. అందుకే రాజకీయ నాయకులపై గౌరవం లేకుండా పోతుంది. సాగర్ ఉపఎన్నికను ఏకగ్రీవం చేయాలనేది నా అభిప్రాయం. పార్టీలో ఎవరు బాధ్యత తీసుకుంటారో నాకు తెలియదు. ఉప ఎన్నిక అంటేనే ఎవరికీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. మొన్నటి ఎన్నికల్లో ఎల్ఆర్ఎస్ ప్రభావం పడింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడును నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే వ్యతిరేకించాను. కృష్ణా బోర్డ్ చెప్పిన తర్వాత కూడా ప్రాజెక్ట్ కట్టడం ఆపకపోతే దాని పర్యవసానాలు వేరేగా వుంటాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎఫెక్ట్ సాగర్ ఉపఎన్నికపై ఉండదు. దుబ్బాకలో గెలిచి.. జీహెచ్ఎంసీలో నాలుగు సీట్లు గెలుస్తే అంతా అయిపోయినట్లేనా? గెలుపు ఓటములు అనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటాయి. కేటీఆర్‌కు సీఎం కావడానికి అన్ని అర్హతలు వున్నాయి. ఆయన సమర్థుడు. ఆయనకు పట్టుదలతో పాటు పని చేసే శక్తి వుంది. ఆయనలో డైనమిజం ఉంది. ఎన్నికల ఫలితాలకు.. అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధం లేదు. నేను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూ.. ఈ పోస్ట్‌తో హ్యాపీగా ఉన్నాను. For More News.. కేసీఆర్ పాలన కంటే రజాకార్ల పాలన భేష్ నేను చనిపోయిన తర్వాత నా అవయవాలు అమ్మి బకాయిలు చెల్లించండి లేడీ ఎస్సై సూసైడ్.. రూంలో నోట్ స్వాధీనం