ఈవీఎంల కమిషనింగ్ ను పరిశీలించిన కలెక్టర్

ఈవీఎంల కమిషనింగ్ ను పరిశీలించిన కలెక్టర్

నల్గొండ అర్బన్, వెలుగు : పట్టణంలోని నాగార్జున కళాశాల ఆవరణలోని నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించిన ఈవీఎం కమిషనింగ్ ను ఆదివారం కలెక్టర్ దాసరి హరిచందన పరిశీలించారు. కమిషనింగ్ చేస్తున్న సందర్భంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయా అనే విషయాలను సెక్టోరల్ ఆఫీసర్స్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, నల్గొండ ఆర్​డీవో రవి ఉన్నారు. 

పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి

పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు.  నల్గొండ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ  కేంద్రాల్లో 6 ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 3 నుంచి ప్రారంభమైన ఫెసిలిటేషన్ కేంద్రాలు ఈనెల 8 వరకు వరకు కొనసాగుతాయని తెలిపారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే సూక్ష్మ పరిశీలకులు, పోలీసులు, పీవో, ఏపీవో, ఇతర సిబ్బంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యోగులందరూ వారికి కేటాయించిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని తెలిపారు.