ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో లోపాలు ఉండొద్దు : కలెక్టర్ తేజస్ నంద్‌ లాల్ పవార్

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో లోపాలు ఉండొద్దు : కలెక్టర్ తేజస్ నంద్‌ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు: ఈ నెల 11న మున్సిపాలిటీలకు జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రపరచడం, లెక్కింపు ప్రక్రియల కోసం స్థానిక ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్,  జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు. లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి లోపాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టి కౌంటింగ్ జరిగే పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తామని అధికారులు తెలిపారు. పదవ తరగతి వార్షిక ఫలితాల్లో సూర్యాపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలన్నారు. 

గురువారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, మోటివేషన్ క్లాసులు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రతి హాస్టల్ సంక్షేమ అధికారి విద్యార్థులు చదివే పాఠశాలలను సందర్శించి సబ్జెక్టు టీచర్లు, ప్రిన్సిపాళ్ల ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకుని అవసరమైతే గ్రూప్ స్టడీ, ట్యూటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఫలితాల్లో వెనుకబడ్డ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.