కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
  • మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేల ప్రచారం

యాదాద్రి, వెలుగు:  మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి కోరారు. ఆలేరు, భువనగిరి మున్సిపాలిటీల్లోని పలువార్డుల్లో వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి  నుంచి అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు.

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించినట్టయితే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. బీఆర్​ఎస్​ అధికారంలో ఉండగా అభివృద్ధిని పట్టించుకోలేదని, ఇప్పుడా ఆ పార్టీకి కొన్ని వార్డుల్లో గెలిపించినా ఉపయోగం ఉండదన్నారు. అన్ని వార్డుల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు.