ఫిబ్రవరి 7న ప్రభుత్వ అద్దె వాహనాల డ్రైవర్ల సమ్మె

ఫిబ్రవరి 7న ప్రభుత్వ అద్దె వాహనాల డ్రైవర్ల సమ్మె

సూర్యాపేట, వెలుగు:  ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ విభాగాలకు అద్దె ప్రాతిపదికన ఫోర్ వీలర్ వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 7న బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింతలచెరువు పవన్, ప్రధాన కార్యదర్శి గంగాధర్ వెంకన్న, జిల్లా నాయకులు రహీం గురువారం తెలిపారు.

ఈ సందర్భంగా ఈనెల 7న బంద్ నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ వినతిపత్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్‌కు గురువారం అందజేశామని, రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లాలో కూడా బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అద్దె ఫోర్ వీలర్ వాహనాల డ్రైవర్లందరూ విధిగా బంద్‌లో పాల్గొనాలని వారు కోరారు.