
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ హీరో మూవీ ‘హను–మాన్’. అమృత అయ్యర్ హీరోయిన్. కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న మేకర్స్, ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం మూవీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. భారతీయ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. ‘ద మోస్ట్ పవర్‌ఫుల్ సూపర్ హీరో హనుమాన్’ అంటూ మనదేశంతో పాటు అమెరికా, చైనా, జపాన్, యు.కె, స్పెయిన్, ఆస్ట్రేలియా, జర్మనీ, శ్రీలంక, మలేషియా దేశాల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ భాషల్లో సినిమా రిలీజ్ కానుందని అనౌన్స్ చేశారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.