Harmanpreet Kaur: భారత్–ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌లో జరిగిన తొలి వన్డేలో భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మోకాలికి గాయం కావడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కు రాలేదు. ఇవాళ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆమె ఎడమ మోకాలికి గాయం అయినట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ సమయంలో ఎడమ మోకాలికి గాయం కావడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేయలేదు.. ఆమె పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది.. ఆమె గైర్హాజరీలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన జట్టును నడిపిస్తున్నారని వెల్లడించింది.
ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత టాప్ ఆర్డర్ పూర్తిగా కుదేలైంది. ప్రతికా రావల్, షెఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ కూడా విఫలం కావడంతో అనంతరం క్రీజులోకి వచ్చిన స్మృతి మందానా (58) హర్మన్‌ప్రీత్ (53) అర్థ సెంచరీలతో చెలరేగగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ కష్వీ గౌతమ్ (43), రిచా ఘోష్ (23) చివర్లో జట్టును అదుకునే ప్రయత్నం చేశారు. దీంతో భారత్ 214 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
ఆసీస్ జట్టు జట్టు 38.2 ఓవర్లలోనే 214 పరుగుల లక్ష్యాన్ని చేధించి తొలి వన్డేలో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0 ఆధిక్యం సాధించింది. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ గాయానికి చికిత్స కొనసాగుతుంది. మిగతా మ్యాచ్‌లకు ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
🚨 𝗨𝗣𝗗𝗔𝗧𝗘
— BCCI Women (@BCCIWomen) February 24, 2026
Captain Harmanpreet Kaur has not taken the field in the second innings after sustaining an injury to her left knee while batting. The BCCI Medical Team is monitoring her progress. Vice-captain Smriti Mandhana is leading the side in her absence.#TeamIndia |…
