IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ పోరులో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. బౌలర్ల ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ వెరసి ఆర్సీబీ ఖాతాలో మరో కీలక విజయం వచ్చి చేరింది.
కుప్పకూలిన లక్నో!
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆది నుంచే వికెట్లు తీస్తూ పరుగుల వేగాన్ని కట్టడి చేశారు. మిచెల్ మార్ష్ (40), ఆయుష్ బదోని (38) కాసేపు ప్రతిఘటించినప్పటికీ భారీ స్కోరు చేయలేకపోయారు. అయితే లోయర్ ఆర్డర్‌లో ముకుల్ చౌదరి (39) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
కోహ్లీ 'వన్‌మ్యాన్ షో':
147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (7), దేవ్‌దత్ పడిక్కల్ (10) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 49 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే దురదృష్టవశాత్తు హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔట్ అయి ఆర్సీబీ అభిమానులను నిరాశపరిచాడు.
ప్రిన్స్ యాదవ్ పోరాటం:
మధ్యలో రజత్ పాటిదార్ (27), జితేష్ శర్మ (23) ధాటిగా ఆడుతున్న సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఒకే ఓవర్లో ఇద్దరినీ అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. కానీ చివర్లో టిమ్ డేవిడ్ (14), రోమారియో షెపర్డ్ (14) బాధ్యతాయుతంగా ఆడి ఆర్సీబీకి సునాయస విజయాన్ని అందించారు. ఇక లక్నో బౌలింగ్ లో ప్రిన్స్ యాదవ్ (3/25), అవేష్ ఖాన్ (2/30) మాత్రమే వికెట్లు పడగొట్టగా, మిగతా బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.
Absolute Class 👌
— IndianPremierLeague (@IPL) April 15, 2026
Virat Kohli wasting no time in the chase 🔥🔥
Updates ▶️ https://t.co/UztAZM9l0q#TATAIPL | #KhelBindaas | #RCBvLSG | @RCBTweets pic.twitter.com/MvHysjL3IV

