ఏపీలో భారీ పేలుడు ఏడుగురు మృతి..అల్లూరి సీతారామరాజు జిల్లా పినకోట వద్ద ఘటన

ఏపీలో భారీ పేలుడు ఏడుగురు మృతి..అల్లూరి సీతారామరాజు జిల్లా పినకోట వద్ద ఘటన
  • టీచర్, డ్రైవర్​తో సహా ఐదుగురు కార్మికుల డెడ్​బాడీలు ఛిన్నాభిన్నం 
  • వెహికల్ నుంచి టిప్పర్​కు డీజిల్ నింపుతుండగా మంటలు
  • ఒక్కసారిగా పేలిన జిలెటిన్ స్టిక్స్ 

హైదరాబాద్, వెలుగు: ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. వాహనం నుంచి టిప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డీజిల్ నింపుతుండగా మంటలు అంటుకొని రహదారి నిర్మాణానికి తీసుకెళ్తున్న జిలెటిన్ స్టిక్స్ ఒక్కసారిగా పేలాయి. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. రెండు వెహికల్స్​ ధ్వంసమయ్యాయి. మృతుల శరీర భాగాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఈ ప్రమాదంలో  డ్రైవర్, ఐదుగురు కార్మికులు మృతి చెందగా.. రోడ్డుపై అటువైపు వెళ్తున్న ఓ టీచర్​కూడా ప్రాణాలు కోల్పోయారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట వద్ద మైనింగ్ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది.  సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పాట్​కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులను టీచర్ సునీత (విశాఖపట్నం), కార్మికులు మణి (దేవరపల్లి), నారాయణరావు (చీడికాడ ), పవన్ కుమార్ (కడప)గా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు.  పేలుడు ఘటన జరగడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.  ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని  డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.