హైదరాబాద్ సిటీ, వెలుగు: బహదూర్‌పుర, కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన 216 మంది లబ్ధిదారులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల మంజూరు పత్రాలు, పట్టాలను పంపిణీ చేశారు. బహదూర్‌పుర నియోజకవర్గానికి చెందినవారికి ఫారూఖ్‌నగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో 136 ఇండ్లు, కార్వాన్ నియోజకవర్గంలోని ఆసిఫ్‌నగర్, గోల్కొండ, షేక్‌పేట మండలాల లబ్ధిదారులకు మల్లాపూర్–బాలాపూర్ కాలనీలో 80 ఇండ్లు కేటాయించినట్లు తెలిపారు.
వచ్చే ఆషాఢమాసంలోపు హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అనంతరం అవిభక్త కవలలు వీణ, వాణితోపాటు అనాథ పిల్లలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లు అందించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, వచ్చే జూలై వరకు వర్షాలు లేకపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని, వాడిన నీటిని తిరిగి ఉపయోగించుకునేలా ఇంకుడు గుంతలు, ఇతర నీటి నిల్వ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యేలు మహమ్మద్ ముబీన్, కౌసర్ మొహియుద్దీన్, కలెక్టర్ ప్రియాంక ఆల, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
