షాద్ నగర్: బూర్గుల గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్

షాద్ నగర్: బూర్గుల గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్

షాద్ నగర్, వెలుగు: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు స్వగ్రామమైన బూర్గులకు ప్రతిష్టాత్మక తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైందని షాద్‌‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. శనివారం తన క్యాంప్ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం తొలి విడతగా రూ.10 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసిందన్నారు.