జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో మై భారత్ ఆధ్వర్యంలో యువత నైపుణ్య శిక్షణ, అభివృద్ధిపై శనివారం రాష్ట్రస్థాయి సమావేశం(కన్వర్జెన్స్మీటింగ్) నిర్వహించారు. మెజీషియన్ సామల వేణు అధ్యక్షత వహించగా, రాష్ట్ర డైరెక్టర్ అన్వేశ్చింతల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, ఫిక్కీ, రాష్ట్ర యువజన సేవల శాఖ, విశ్వవిద్యాలయాల ప్రతినిధులతోపాటు లయన్స్, రోటరీ, జేసీస్, వాసవి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, వైఎంసీఏ తదితర సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
