చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్ బిల్లు కాపీలను తగలబెట్టి నిరసన తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రతిని దహనం చేసిన సీఎం స్టాలిన్.. ఈ బిల్లును 'నల్ల చట్టం'గా అభివర్ణించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రతిని దహనం చేశారు. ఈ బిల్లు తమిళ ప్రజలను వారి సొంత భూమిలోనే 'శరణార్థులుగా' మార్చాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కొన్ని గంటల ముందు.. స్టాలిన్ డీఎంకే పార్టీ ఆఫీస్పై నల్ల జెండాను ఎగురవేసి నిరసన తెలిపారు.
#WATCH | Namakkal | DMK President and Tamil Nadu CM MK Stalin wearing black attire hoists a black flag in protest against the Centre's delimitation move. He also burns a copy of the Delimitation bill.
— ANI (@ANI) April 16, 2026
(Video source: DMK) pic.twitter.com/5DioOoBYMe
ఇదిలా ఉండగా.. డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తు్న్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనతో లోక్‌సభ సీట్లను 543 నుంచి 850 వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లో కూడా సీట్ల సంఖ్యను పెంచాలని యోచిస్తున్నారు.
అయితే ఈ మార్పుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్‌కు పూర్తి మద్దతు ఉన్నప్పటికీ, ఓబీసీలు, దళితులు, ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే విధానాలను అనుమతించబోమని స్పష్టం చేశాయి. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఏకమై పార్లమెంట్‌లో వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించాయి.

