చెన్నై: స్లో ఓవర్ రేట్ కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానెకు భారీ జరిమానా పడింది. మంగళవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత టైమ్‌లో ఓవర్ల కోటా పూర్తి చేయనందుకు అతనికి రూ. 12 లక్షల ఫైన్ విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 రూల్‌ను రహానె ఉల్లంఘించినట్లు నిర్వాహకులు తేల్చారు.
ఈ సీజన్‌లో తొలి తప్పు కావడంతో కేవలం కెప్టెన్‌పై చర్యతోనే సరిపెట్టారు. మెగా లీగ్‌లో నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న కేకేఆర్.. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది.

