మామూలుగా ఏదైనా క్రీడా పోటీలను ప్రారంభించేటప్పుడు ప్రజా ప్రతినిధులు కూడా అందులో పాల్గొన్నట్టు ఫొటోలకు ఫోజివ్వడం చూస్తూనే ఉంటాం. ఆ నేత మరింత క్రీడాభిమాని అయితే... కాసేపు ఆ ఆటను ఆడి ఉత్తేజపరుస్తాడు. కానీ ఓ సీఎం మాత్రం సాధారణ క్రీడాకారులతో కలిసి ఆటల్లో పాల్గొనడం ఎప్పుడైనా చూశారా.. ఇంతకీ ఆ సీఎం ఎవరు.. అది ఎక్కడ జరిగింది అనే విషయానికొస్తే.. పంజాబ్ లో ఖేదన్ వతన్ పంజాబ్ దియాన్-2022 లో భాగంగా క్రీడా పోటీలను ప్రారంభించిన సందర్భంగా అక్కడి సీఎం భగవంత్ మాన్ ఆటగాళ్లతో కలిసి వాలీబాల్ ఆడారు. అంతగా ప్రావీణ్యం లేకపోయినా జోష్ ఫుల్ గా ఆడుతూ.. అందర్నీ ఆకట్టుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ శాఖ షేర్ చేసింది. ఈ వీడియోలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్రాక్ సూట్ ధరించి ఉండడాన్ని చూడవచ్చు. సెంటర్ లో ఉండి ఆరుగురి జట్టులో ఓ సభ్యుడిలా ఆడుతూ అక్కడి వారందరినీ ఉత్సహపరిచారు. ఇదిలా ఉండగా దాదాపు 2 నెలల పాటు జరిగే ఈక్రీడాపోటీలను జలంధర్ లోని గురుగోవింద్ సింగ్ స్టేడియంలో సీఎం ప్రారంభించారు. ‘మన్ సాహబ్ ఆన్ ది పిచ్’ క్యాప్షన్ తో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ శాఖ ఈవీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో మాన్ ఆటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Mann Sahab on the pitch
— AAP Punjab (@AAPPunjab) August 29, 2022
?
CM @BhagwantMann played volleyball with the young, talented players #KhedanVatanPunjabDiyan pic.twitter.com/TaYio0Hw3p
