V6 News

గంగా, యమునా నదుల ఉగ్రరూపం

గంగా, యమునా నదుల  ఉగ్రరూపం

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ దగ్గర గంగా, యమునా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సంగం వద్ద ఉన్న పురాతన హనుమాన్ ఆలయం నీట మునిగింది. రెండు నదుల నీటిమట్టం పెరగడంతో.. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో పాటు పలు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

వీరు ఉంటున్న గదుల్లోకి నీరు చేరడంతో.. వాటిని ఖాళీ చేసి ఎక్కడా వసతి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వరద ముప్పు దృష్ట్యా  NDRF బృందం ప్రయాగ్ రాజ్ చేరుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.