హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు కాలనీలు, బస్తీలు చిమ్మచీకట్లోనే ఉండిపోయాయి. శంషాబాద్ తదితర ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షం.

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహానాలన్ని ఎక్కడికక్కడే నిలచిపోయాయి. రోడ్లన్ని జలమయమయ్యాయి. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ లలో కూడా ఓ మోస్తారు వర్షం కురిసింది. ఉప్పల్, మేడిపల్లిలలో ఈదురు గాలులతో కూడిన వర్షం, ఓయూ, తార్నాక, అంబర్ పెట్ లో చిరుజల్లులు పడుతున్నాయి.