Novak Djokovic vs Virat Kohli: టెన్నిస్ రారాజు నోవాక్ జొకోవిచ్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల మధ్య దోస్తీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ 2026 టోర్నీ సందర్భంగా జొకోవిచ్.. కింగ్ కోహ్లీతో తనకున్న బాండింగ్ గురించి మాట్లాడుతూ, త్వరలోనే భారత్‌లో ప్లాన్ చేస్తున్న క్రేజీ లింక్-అప్స్ గురించి మైండ్ బ్లోయింగ్ విషయాలని తెలియజేశాడు.
సోషల్ మీడియాలో పరిచయం:
వేర్వేరు క్రీడల్లో ప్రపంచాన్ని ఏలుతున్న ఈ ఇద్దరు మోడ్రన్ డే గ్లాడియేటర్ల మధ్య కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియా ద్వారా ఆర్గానిక్‌గా పరిచయం ఏర్పడింది. మేము ఇప్పటి వరకు ఎప్పుడూ ఫేస్-టు-ఫేస్ కలవలేదు.. కానీ గత కొన్ని సంవత్సరాలుగా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా టచ్‌లోనే ఉన్నాం.. ఒకరినొకరు ఫాలో అవుతూ, సపోర్ట్ చేసుకుంటాం, త్వరలోనే కోహ్లీని పర్సనల్‌గా కలిసి, అతనితో కాస్త టెన్నిస్, క్రికెట్ ఆడాలని ఉందని సెర్బియా లెజెండ్ జొకోవిచ్ ‘స్టార్ స్పోర్ట్స్’ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
త్వరలోనే ఇండియాలో కోహ్లీని కలుస్తా:
జొకోవిచ్ కేవలం కోహ్లీని పొగడటంతోనే ఆగకుండా, సబ్‌కాంటినెంట్ ఫ్యాన్స్‌కు ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. నేను త్వరలోనే ఇండియా టూర్ ప్లాన్ చేస్తున్నాను.. బహుశా అక్కడే మా ఇద్దరి క్రేజీ భేటీ జరగొచ్చు అని హింట్ ఇచ్చాడు. ఈ ముచ్చట విన్న ఇండియన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అసలు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ లేని జొకోవిచ్.. కేవలం విరాట్ కోహ్లీ అగ్రెసివ్ ఆటతీరు, మైదానంలో అతని ఇంటెన్స్ పవర్‌ఫుల్ పర్సనాలిటీ చూసే క్రికెట్ మ్యాచ్‌లను చూడటం స్టార్ట్ చేసినట్లు తెలిపాడు.
కోహ్లీ-జొకోవిచ్ ల కలయిక కోసం వెయిటింగ్:
* విరాట్ కోహ్లీ: గత మే నెల చివర్లో చిన్న హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడిన కోహ్లీ.. ఇటీవల పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. జూలై 14 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే (ODI) సిరీస్ ద్వారా విరాట్ మళ్లీ ఇంటర్నేషనల్ డ్యూటీలోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
* నోవాక్ జొకోవిచ్: 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత అయిన జొకోవిచ్.. ఈ వింబుల్డన్ టోర్నీలో 7వ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. 2023 యూఎస్ ఓపెన్ తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్ గెలవని జొకోవిచ్.. జూన్ 29న వూ యిబింగ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా తన వింబుల్డన్ వేట స్టార్ట్ చేయనున్నాడు. లండన్ వింబుల్డన్ లో జొకోవిచ్ కప్పు గెలిచినా గెలవకపోయినా.. క్రీడా ప్రపంచం మాత్రం ఆ తర్వాత జరగబోయే కోహ్లీ-జొకోవిచ్ ల చారిత్రాత్మక కలయిక కోసమే వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తోంది.
Novak Djokovic talking about Virat Kohli. pic.twitter.com/JOXmI2AE7g
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2026
