హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం.. మరో ఐదు రోజులు వానలే

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం.. మరో ఐదు రోజులు వానలే

హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది.  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,అమీర్ పేట, పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి,హెటెక్ సిటీ, కొండాపూర్,  ఖైరతాబాద్ ,లక్డీకపూల్ లో వర్షం పడుతోంది.  దాదాపు గంట నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.   చింతల్, జీడిమెట్ల, కొంపల్లి,సుచిత్ర, అల్వాల్ సికింద్రాబాద్  లో మోస్తరు జల్లులు కురుస్తున్నాయి.  పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

 గత రెండు రోజులగా రాష్ట్రంలో వాతావారణం కూల్ గానే ఉంది.  హైదరాబాద్‌ లో వచ్చే ఐదు రోజుల పాటు వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని  అంచనా వేసింది. 

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో   జులై 4, 5,6  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.