అమెరికాలో పూజారిపై దాడి

అమెరికాలో పూజారిపై దాడి

అమెరికాలో పూజారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. న్యూయార్క్​లోని గ్లెన్‌ ఓక్స్‌ ప్రాంతంలో శివ శక్తి పీఠం వద్ద నడుచుకుంటూ వెళుతున్న స్వామి హరీశ్ చందర్ పూరీని విచక్షణారహితంగా కొట్టాడు. వెనుకనుంచి వచ్చి దాడి చేసిన అతడు.. ‘ఇది మా ఏరియా’ అని నినాదం చేసినట్లు తెలిసింది. దీంతో పూజారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ నెల 18న (అక్కడి టైం ప్రకారం) ఉదయం 11 గంటల సమయంలో స్వామిపై దాడి జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి సెర్జియా గువెయ(52) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘విద్వేషపూర్వకంగా చేసిన దాడి’ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.