ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు ఫోన్ చేసిన బ్రాడ్ పిట్
చంద్రయాన్ 2 ల్యాండర్ విక్రమ్ ఆచూకీ కోసం మన ఇస్రో సహా నాసా కూడా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఫొటోలు తీస్తామని నాసా చెప్పింది. ఇప్పుడు ఆ ఆసక్తి హాలీవుడ్ హీరో బ్రాడ్పిట్కు కూడా కలిగినట్టుంది. ఐఎస్ఎస్కు ఫోన్ చేసి ఆస్ట్రోనాట్ నిక్ హేగ్ను విక్రమ్ ఆచూకీపై ఆయన ఆరా తీశారు మరి.
‘‘విక్రమ్ ల్యాండింగ్ రోజే నేను నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీకి వెళ్లాను. అమెరికా కూడా అందుకు సాయం చేస్తోందని తెలుసుకున్నా. కానీ, దురదృష్టవశాత్తూ అది సక్సెస్ కాలేదు. మరి, ఐఎస్ఎస్ నుంచి మీకేమైనా విక్రమ్ కనిపించిందా? దాని జాడను కనిపెట్టారా?” అని హేగ్స్ను బ్రాడ్ పిట్ అడిగారు. అయితే, తమకేమీ దాని జాడ తెలియలేదని, తామూ అందరిలాగే న్యూస్ రిపోర్టుల కోసం వేచి చూస్తున్నామని హేగ్ రిప్లై ఇచ్చారు. బ్రాడ్ పిట్ తీసిన ‘యాడ్ ఆస్ట్రా’ అనే స్పేస్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన నాసా నుంచి ఐఎస్ఎస్కు ఫోన్ చేశారు. అందులో భాగంగా హేగ్స్ ను బ్రాడ్ కొన్ని ప్రశ్నలు అడిగారు.

