బీపీ ఉన్న వారు ఈ 3 డ్రింక్స్‌కు దూరంగా ఉండాల్సిందే !

 బీపీ ఉన్న వారు ఈ 3 డ్రింక్స్‌కు దూరంగా ఉండాల్సిందే !

ప్రపంచ ఆరోగ్య సమస్యల లిస్టులో గుండె జబ్బులు ఇప్పటికీ టాప్ లో  ఉన్నాయి.  గుండె జబ్బులు రావడానికి 'హై బీపీ' ముఖ్య కారణం. ఇది సైలెంట్‌గా మన శరీరాన్ని దెబ్బతీస్తుంది. అయితే మన జీవనశైలిని మార్చుకుంటే దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. గుండె నిపుణుల డాక్టర్  ప్రకారం.. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఈ మూడు రకాల పానీయాలకు దూరంగా ఉండాలి:

1. మద్యం/ఆల్కహాల్: చాలామంది రిలాక్స్ అవ్వడానికి మద్యం తాగుతుంటారు. కానీ అది శరీరానికి చాలా చెడు  చేస్తుంది. ఇంకా  మీ నిద్రను పాడు చేస్తుంది. శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్లను (కార్టిసాల్ వంటివి) విడుదల చేస్తుంది. అందుకే గుండె పదిలంగా ఉండాలంటే మద్యం మానేయడం ఉత్తమం.

2. కృత్రిమ పానీయాలు/ డ్రింక్స్: బయట మార్కెట్లో దొరికే రంగురంగుల కూల్ డ్రింక్స్ చూడటానికి బాగున్నా, అవి ఆరోగ్యానికి అంత సేఫ్ కాదు. వీటిలో రంగులు, రుచి కోసం వాడే కెమికల్స్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. శరీరానికి అవసరం లేని సింథటిక్ పదార్థాలు వీటిలో నిండి ఉంటాయి.

3. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు: సోడాలు, కోలాలు, డబ్బాలలో ప్యాక్ చేసిన పానీయాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అధిక చక్కెర వల్ల రక్తపోటు విపరీతంగా పెరుగుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్ లేదా క్యాన్లలో ఉండే ఈ పానీయాల వల్ల మైక్రోప్లాస్టిక్స్ వంటివి శరీరంలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.

మనం రోజూ తాగే పానీయాల విషయంలో చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అలాగే ఈ మూడు పానీయాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండండి.