V6 News

డేటింగ్ యాప్తో హనీ ట్రాప్..న్యూడ్ కాల్స్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు టోకరా

డేటింగ్ యాప్తో హనీ ట్రాప్..న్యూడ్ కాల్స్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు టోకరా
  • రూ. 2.5 లక్షలు వసూలు చేసిన ‘శిక్ష’
  •     పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

ఎల్బీనగర్, వెలుగు: డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై, న్యూడ్ వీడియో కాల్స్​తో యువకులను బుట్టలో వేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ఓ కిలాడీ లేడీ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగి (25)కి గత ఏప్రిల్​లో ‘హ్యాపెన్’ అనే డేటింగ్ యాప్​లో ‘శిక్ష’ అనే పేరుతో ఓ యువతి పరిచయమైంది. వారిద్దరూ కొంతకాలం క్లోజ్​గా మాట్లాడుకున్నారు. వాట్సాప్​లో న్యూడ్ వీడియో కాల్స్ చేసుకున్నారు. అయితే, ఆ యువతి ఆ కాల్స్​ను స్క్రీన్ రికార్డ్ చేసింది. అనంతరం టెలిగ్రామ్ ద్వారా బాధితుడి ఫోన్ కాంటాక్ట్స్ సేకరించి, అసలు రూపం బయటపెట్టింది. 

రికార్డ్ చేసిన న్యూడ్ వీడియోలను బాధితుడికి పంపి డబ్బులు డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించింది. భయపడిపోయిన బాధితుడు విడతల వారీగా రూ. 2.51 లక్షలు ఆమెకు ట్రాన్స్​ఫర్ చేశాడు. అంతటితో ఆగని కి‘లేడీ’.. మరో రూ. 4 లక్షలు ఇవ్వాలని వేధింపులకు గురి చేయడంతో బాధితుడు బుధవారం మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.