టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, నటి మృణాల్ ఠాకూర్ కలిసిన నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్'. భారీ అంచాలతో ఈ మూవీ ఏప్రిల్ 10, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే మిశ్రమ స్పందనను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించిన ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇంకా థియేటర్లలో రన్ అవుతోంది. అయితే ఇప్పుడుఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ రెడీ అవుతోంది.
ఓటీటీలోకి రెడీ?
థియేటర్ రన్ ముగించుకున్న వెంటనే ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ 'డెకాయిట్' చిత్రాన్ని భారీ మొత్తంలో స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం మే 8 నుంచి దేశవ్యాప్తంగా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కథాంశం..
'డెకాయిట్' కథాంశం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. జైలు నుంచి తప్పించుకున్న ఒక హత్య నేరస్తుడు, తన మాజీ ప్రేయసిపై పగ తీర్చుకోవడమే లక్ష్యంగా ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఈ క్రమంలో జరిగే ఊహించని పరిణామాలు, మలుపులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి. ఏది తప్పు? ఏది ఒప్పు? అనే సందిగ్ధంలో సాగే ఈ ప్రయాణం క్లైమాక్స్ వరకు ఉత్కంఠను రేపుతుంది.ఈ సినిమాలో అడివి శేష్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు
సినిమాలో స్టైలిష్‌గాఅడివి శేష్ కనిపిస్తూనే, భావోద్వేగ సన్నివేశాల్లోనూ రాణించారు. మృణాల్ ఠాకూర్ తన పాత్ర పరిధి మేరకు అద్భుతమైన నటనను కనబరిచారు. అడివి శేష్‌తో ఆమె కెమిస్ట్రీ స్క్రీన్ పై ఫ్రెష్‌గా ఉంది. ఒక విలక్షణమైన పోలీస్ ఆఫీసర్‌గా అనురాగ్ కశ్యప్ కొత్త లుక్‌లో కనిపించారు. ఇక సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన అనుభవాన్ని జోడించారు.
ఎలా ఉందంటే?
భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. సినిమాలో కొన్ని ట్విస్టులు, ముఖ్యంగా క్లైమాక్స్ షాకింగ్‌గా ఉంటుంది. విమర్శకుల నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మాస్ ఆడియన్స్‌ను అలరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు సినీ అభిమానులు.'డెకాయిట్' థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు త్వరలోనే ఓటీటీలో చూడొచ్చు. ఈ యాక్షన్ లవ్ స్టోరీ డిజిటల్ రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

