- వెల్లడించిన అడెక్కో రిపోర్ట్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వెహికల్స్(ఈవీలు) ఇండస్ట్రీ 2030 నాటికి నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని అడెక్కో ఇండియా రిపోర్ట్ వెల్లడించింది. ఏటా నియామకాలు 15 శాతం నుంచి 20 శాతం వృద్ధి చెందుతాయి. ఇంజనీరింగ్, ఎనర్జీ సిస్టమ్స్, బ్యాటరీ టెక్నాలజీ నిపుణులకు అత్యధిక డిమాండ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ ఫ్లీట్స్, టూ-వీలర్స్ భారీగా అమ్ముడవుతున్నాయి.
ఈవీలకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఢిల్లీలో 55 శాతం దాకా డిమాండ్ ఉంది. హోసూర్, సానంద్, ధోలేరా వంటి టైర్-2, టైర్-3 పారిశ్రామిక కారిడార్లలో కూడా పెట్టుబడులు వేగంగా విస్తరిస్తున్నాయి. గిగాఫ్యాక్టరీలు, బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్లు కొత్త ఉపాధి మార్గాలను తెరుస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా చొరవతో ముడి చమురు దిగుమతుల భారం తగ్గుతోంది. నెట్-జీరో ఉద్గారాల లక్ష్య సాధనకు ఈ రంగం ఎంతగానో తోడ్పడుతుందని రిపోర్ట్ వివరించింది.
