ఎంప్లాయర్ బ్రాండ్ గా గూగుల్..తర్వాత స్థానాల్లో టాటా, అమెజాన్

 ఎంప్లాయర్  బ్రాండ్ గా గూగుల్..తర్వాత స్థానాల్లో టాటా, అమెజాన్
  • రాండ్​ స్టాడ్ రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ:భారతదేశంలో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్​ బ్రాండ్‌‌గా టెక్నాలజీ కంపెనీ గూగుల్ అవతరించింది. టాటా గ్రూప్ రెండో స్థానంలో, అమెజాన్ మూడో స్థానంలో నిలిచాయి. రాండ్​స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2026 రిపోర్ట్​ ప్రకారం..శామ్​సంగ్ , ఇన్ఫోసిస్, రిలయన్స్ తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఐటీసీ , హెచ్​యూఎల్​, మహీంద్రా , డెల్ టెక్నాలజీస్ కూడా టాప్–-10లో చోటు దక్కించుకున్నాయి. రాబోయే ఆర్నెళ్లలో 46 శాతం మంది భారతీయ నిపుణులు ఉద్యోగాలు మారాలని భావిస్తున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్, సమాన అవకాశాలు, కెరీర్ పురోగతి, జీతం, ప్రయోజనాలు ఉద్యోగులను ఆకర్షించే ముఖ్యమైన అంశాలుగా మారాయి. డిజిటల్ టాలెంట్ నిపుణులు పోటీ జీతాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పనిలో గుర్తింపు, కెరీర్ కొనసాగింపు భద్రతకు బలమైన పునాదులుగా ఉంటాయని రాండ్​స్టాండ్​ సర్వే స్పష్టం చేసింది.