V6 News

తగ్గిన బంగారం, వెండి.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే..

తగ్గిన బంగారం, వెండి.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే..

పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో బులియన్ మార్కెట్లు తిరిగి పుంజుకునేలా కనిపించటం లేదు. ఒకపక్క వెండి ధరలు కరెక్షన్ ఫేజ్ లో కొనసాగుతుంటే.. మరో పక్క బంగారం క్లారిటీ లేక దాదాపుగా స్థిరంగానే కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆభరణాలు కొనాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ సమీప నగరాల్లో తాజా రేట్లను పరిశీలించటం మంచిది. 

ఏప్రిల్30న బంగారం రేట్లు పెరిగాయి. ఏప్రిల్ 29 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.22 పెరుగుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 066గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 810గా కొనసాగుతోంది. 

గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్30, 2026న దేశవ్యాప్తంగా రేటు కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 60వేల వద్ద ఉంది. అంటే గ్రాము ధర రూ.260గా అమ్మకాలు జరుగుతున్నాయి.