కిలిమంజారో అధిరోహించిన హైదరాబాద్ బాలిక

కిలిమంజారో అధిరోహించిన హైదరాబాద్ బాలిక
  • ఎం.పులకిత హస్వి(13)ని అభినందించిన గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్

హైదరాబాద్: ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారోను హైదరాబాద్ కు చెందిన 13 ఏళ్ల బాలిక ఎం.పులకిత హస్వి అధిరోహించింది. అత్యంత క్లిష్టపూరిత వాతావరణ పరిస్థితులు ఎదురైనా నిర్భయంగా అధిరోహించిన హస్వికి కిలిమంజారోపై భారత పతాకంతో విజయదరహాసం చేసింది. పర్వతారోహణ (ట్రెక్కింగ్)ను హాబీగా చేసుకుని కఠోర సాధన చేస్తున్న పులకిత హస్వికి ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారోను విజయవంతంగా అధిరోహించడంపై సంతోషం వ్యక్తం చేసింది.

తన చిరకాల స్వప్నం నెరవేరిందని.. భవిష్యత్తులో ప్రపంచంలోని మొత్తం ఏడు అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించడానికి ఈ విజయం దోహదపడుతుందన్నారు. పర్వతారోహణ శిక్షణలో భాగంగా శారీరక ఆరోగ్యంతోపాటు మానసికంగా దృఢంగా తయారు కావడం కోసం యోగా, ధ్యానంలో శిక్షణ పొందానని తెలిపింది. వచ్చే ఏడాది మిగిలిన అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటానని తెలిపింది. 
అభినందించిన గవర్నర్ తమిళ సై సౌందరరాజన్
ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన హైదరాబాద్ యువ కిరణం ఎం. పులకిత హస్వి(13)కు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆమె భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.