కేబీఆర్ పార్కు చుట్టూ సీసీ కెమెరాలు.. ఎందుకంటే..

కేబీఆర్ పార్కు చుట్టూ సీసీ కెమెరాలు.. ఎందుకంటే..

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ ప్రధాన కూడళ్లతోపాటు  కేబీఆర్ చుట్టూ 240 సీసీ కెమెరాలతో నెట్ వర్క్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ జోన్ పోలీసులు శనివారం ప్రకటించారు. రూ. 1.40 కోట్లతో భద్రత పర్యవేక్షణను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సీసీ టీవీ ప్రాజెక్టను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు.  వెస్ట్ జోన్ పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 264 కెమెరాలలో దాదాపు 150 కేబీఆర్ పార్క్ చుట్టూ ఏర్పాటు చేశారు. మిగిలిన వాటిని రోడ్ నెం. 36, రోడ్ నెం. 45, జూబ్లీ చెక్ పోస్ట్ ప్రాంతాల్లో అమర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. తమతమ ప్రాంతాల్లో అదనపు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు మద్దతు కొనసాగించాలని కోరారు. 

ALSO READ :కొద్దిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న సీఎం

కాగా.. ఇటీవల KBR పార్క్ సమీపంలో జాగింగ్ చేస్తున్న ఓ మహిళా సినీ నిర్మాతపై ఆకతాయిలు వేధింపులకు గురిచేసిన సంఘటన తెలిసిందే. వీఐపీలతోపాటు మార్నింగ్ వాకర్లకు ప్రసిద్ధి చెందిన కేబీఆర్ పార్కులో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.  2021 నవంబర్ లో టాలీవుడ్ నటి షాలు చౌరాసియా.. ఈవినింగ్ వాక్ చేస్తున్నప్పుడు దాడి చేసి దోచుకున్నారు.  దాడిని ప్రతిఘటించే క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. అదే నెలలో గుర్తు తెలియని వ్యక్తి తనను వేధించి రూ.2,500 లాక్కెళ్లాడని మరో మహిళ ఫిర్యాదు చేసింది. కేబీఆర్ పార్క్ పరిధిలో ఆకతాయిలు ఆగడాలు, దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో వెస్ట్ జోన్ పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. స్థానికు ప్రజాప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులు సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుచేశారు.