లడఖ్‌లో పరిస్థితులపై ఐఏఎఫ్​ చీఫ్ భదౌరియా మీటింగ్

లడఖ్‌లో పరిస్థితులపై ఐఏఎఫ్​ చీఫ్ భదౌరియా మీటింగ్

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ప్రస్తుత పరిస్థితిపై చర్చించడానికి ఎయిర్ చీఫ్​ మార్షల్ ఆర్‌‌కేఎస్ భదౌరియా మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో టాప్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ పాల్గొననున్నారు. ఈ మీటింగ్‌లో ఇండియన్ ఎయిర్‌‌ ఫోర్స్ (ఐఏఎఫ్)కు సంబంధించిన ట్విన్ ఇంజిన్ ఫైటర్‌‌ల విస్తరణపై చర్చించనున్నారు. అలాగే నార్తర్న్ బార్డర్‌‌లో ఎస్‌యూ–30ఎంకేఐ, మిరాజ్–2000తో కోఆర్డినేషన్ కోసం రఫేల్ యుద్ధ విమానాలను త్వరితగతిన రప్పించడం, విస్తరించడంపై మాట్లాడననున్నారు. అలాగే లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎల్‌ఏసీ వెంబడి ఫైటర్ జెట్స్‌ను మోహరించింది. ఈ సమావేశంలో చైనా మిలిటరీ కదలికల గురించి డిస్కస్ చేయడానికి ఐఏఎఫ్‌కు చెందిన సీనియర్ అఫీషియల్స్ కూడా హాజరుకానున్నారు.