అక్టోబర్ 1 నుంచి క్రికెట్లో కొత్త నిబంధనలు అమలు

అక్టోబర్ 1 నుంచి క్రికెట్లో కొత్త నిబంధనలు అమలు

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) క్రికెట్లో కొత్త నిబందనలు తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని ఐసీసీ వెల్లడించింది. క్రికెట్‌లో కొన్ని నియమాలను మార్చుతున్నట్లు మంగళవారం ప్రకటించింది.

కొత్త నిబంధనల ప్రకారం.. క్రీజులో ఉన్న బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే.. కొత్త బ్యాటర్ కచ్చితంగా స్ట్రైకింగ్ తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. బాల్ షైనింగ్ అయ్యేందుకు ఉమ్మిరాసే విధానాన్ని పూర్తిగా నిషేధించింది. ఫీల్డ్ లోకి వచ్చే కొత్త ప్లేయర్ రెండు నిమిషాల్లో స్ట్రైక్ తీసుకోవాలి. ఫీల్డింగ్ సైడ్ వాళ్లు కావాలని బ్యాటర్లను ఇబ్బంది పెడితే.. బ్యాటింగ్ సైడ్ వాళ్లకు 5 పరుగులు పెనాల్టీ రూపంలో అంపైర్ ఇవ్వొచ్చు. బౌలింగ్ టైంలో నాన్- స్ట్రైకర్ క్రీజులో లేకపోతే బౌలర్ ఔట్ చేయడాన్ని రనౌట్ గా పరిగణించనున్నారు. ‘మన్కడింగ్‌’ రూపంలో చేసే రనౌట్‌ను ఇక మీదట ‘అన్‌ఫెయిర్‌ ప్లే’  సెక్షన్‌ నుంచి ‘రన్‌ అవుట్‌’ సెక్షన్‌లోకి మార్చారు.