T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్

  T20 World Cup 2024   :   టీ20 వరల్డ్ కప్ ...  జట్టును ప్రకటించిన న్యూజిలాండ్

జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా  జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం  న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. దీంతో ఈ మెగా టోర్నీ కోసం జట్టును ప్రకటించిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.  15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.. ఇందులో  స్టార్ ప్లేయర్లు అందరికీ చోటు కల్పించింది. కెప్టెన్  కేన్ విలియమ్సన్ కు ఇది ఆరో వరల్డ్ కప్ కాగా కెప్టెన్ గా  నాలుగోది కావడం విశేషం.  టిమ్ సౌథీకి ఇది ఏడో వరల్డ్ కప్  టోర్నీ.  

కాగా జూన్ 1న  టీ20 వరల్డ్ కప్  మొదలుకానుంది.  జూన్ 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. అందులో భాగంగా న్యూజిలాండ్ తన తొలి మ్యాచును జూన్ 7న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్, ఉగాండ, పపువా న్యూ గునియాలతో మ్యాచులు ఆడనుంది. మొత్తం ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి.

టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ జట్టు:
 
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకెల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, లుకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, బెన్ సీర్స్- ట్రావెలింగ్ రిజర్వ్